LIVE : మూసీ ప్రక్షాళనపై మీడియాతో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు - Minister Sridhar Babu Live - MINISTER SRIDHAR BABU LIVE
Published : Oct 1, 2024, 5:21 PM IST
|Updated : Oct 1, 2024, 5:52 PM IST
Minister Sridhar Babu on BRS Live : మధ్య తరగతి ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పేదలకు మేలు చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ చేసిన పనులను ఆ పార్టీ నేతలు మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. 2017లో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందెవరు? అని ప్రశ్నించారు. మూసీ నదిలో కాలుష్యం తీవ్రంగా ఉంది, కాలుష్యరహితంగా చేస్తామని చెప్పారని తెలిపారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గతంలోనే ఒక ఛైర్మన్‌ను కూడా నియమించారని గుర్తు చేశారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికను కూడా రూపొందించారని, అక్రమ కట్టడాల లెక్క తీసి వాటిని తొలగించాలని ప్రణాళికలో పొందుపరిచారని చెప్పారు. మూసీ నదికి కూడా బఫర్‌జోన్ ఏర్పాటు చేసి హద్దులు గుర్తించాలని చెప్పారని తెలిపారు. మూసీ నది ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎన్నో సమావేశాలు నిర్వహించారని అన్నారు. మాస్టర్ ప్లాన్‌ను పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ను ఉదేశిస్తూ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు.
Last Updated : Oct 1, 2024, 5:52 PM IST