LIVE : అల్లు అర్జున్ మీడియా సమావేశం - ALLU ARJUN PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
Published : 11 hours ago
|Updated : 11 hours ago
Allu Arjun Press Meet Live : డిసెంబరు 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంధ్య థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేశారు. అదే రోజు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసి బెయిల్ తెచ్చుకున్నారు. ఇవాళ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై వివరణ ఇచ్చారు. సినిమా రిలీజ్ రోజు పోలీసులు వద్దని చెప్పినా వినకుండా అల్లు అర్జున్ థియేటర్‌కు బెనిఫిట్ షో చూసేందుకు వచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. అప్పటికే అభిమానుల సంఖ్య అధికంగా ఉండటంతో పోలీసులు ఎలాంటి ర్యాలీ వద్దని చెప్పినా వినలేదని సీఎం ప్రకటించారు. అల్లు అర్జున్ చర్యలే తొక్కిసలాటకు కారణమయ్యాయని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటనపై అల్లు అర్జున్ స్పందిస్తున్నారు. లైవ్‌లో చూద్దాం
Last Updated : 11 hours ago