Jungle Safari In Gadhpur Mancherial : అందమైన పర్వతాలు, చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం, పాలధారను తలపించే నీటి కుంటలు అనగానే వెంటనే ఏపీలోని అరకు గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడి నుంచి అంత దూరం ప్రయాణం చేసి వెళ్లాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. మన రాష్ట్రంలోనే అలాంటి పర్యాటక ప్రదేశం ఉంది. ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా?
పర్యాటకులకు అందాల కనువిందు : కనుచూపు మేర పచ్చటి పైట కప్పేసుకున్నట్టుగా కనువిందు చేసే అడవి. అక్కడో నీలి రంగు పులుముకున్న నీటి కుంట. అల్లంత దూరాన వంపులు తిరిగిన ఎత్తయిన, అందమైన పర్వతాలు. వాటి మధ్య అందాల నిధిని దోచుకోగ, రారమ్మని ఆహ్వానిస్తున్నట్టు ఓ రహదారి. ఇవీ గడ్పూర్లోని జంగిల్ సఫారీ ప్రత్యేకతలు. దీని అందాల గురించి చెప్పడం కాదు. అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా అస్వాదిస్తే ఆ కిక్ వేరే లెవల్లో ఉంటుంది.
20 కి.మీ అడవిలో విహరించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు : మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గఢ్పూర్లో జంగిల్ సఫారీ ఉంది. పట్టణానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 20 కిలోమీటర్ల మేర అడవిలో విహరించే విధంగా అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. మరింకెందుకు ఆలస్యం చూసొచ్చేయండి.
ఈ మంచు వేళల్లో పాపికొండలు టూర్ - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ!
మంచువేళల్లో అరకు అందాలు - తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ!