తెలంగాణ

telangana

ETV Bharat / videos

దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం : మంత్రి పొన్నం - మంత్రి పొన్నం ప్రభాకర్‌

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 7:53 PM IST

Minister Ponnam in Distribution of Prosthetic Limbs to Disabled People : రాష్ట్రంలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. వికలాంగుల కోసం నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో కింగ్ కోఠిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల కోసం ఉచిత స్క్రీనింగ్, మెజర్​మెంట్ క్యాంప్‌ను మంత్రి ప్రారంభించారు. 

ఉదయ్‌పూర్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు గెలుచుకున్న నారాయణ సేవా సంస్థాన్, దేశ వ్యాప్తంగా వికలాంగులకు కృతిమ అవయవాలను ఉచితంగా అందిస్తూ గొప్ప సేవా చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత తన మనస్సు చలించిపోయిందని, తప్పని సరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహించడంతో పాటు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దేశం, రాష్ట్రంలో ఉన్న మనవాతవాదులు ప్రతి ఒక్కరూ కృతిమ కాళ్లు అమార్చడానికి చేస్తున్న సంస్థాన్‌ను ఆదుకోవాలని మంత్రి పొన్నం కోరారు.

ABOUT THE AUTHOR

...view details