తెలంగాణ

telangana

ETV Bharat / videos

గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్ ​బాబు - Minister Sridhar Prays Lord Ganesh - MINISTER SRIDHAR PRAYS LORD GANESH

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 2:09 PM IST

Minister Sridhar Prayed Lord Ganesh at Manthani : పెద్దపల్లి జిల్లా మంథనిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్టణంలోని గణపతి మండపాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావు చెరువు కట్ట గణపతి సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశేషంగా పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వీధివీధిన చిన్నా పెద్దా తేడా లేకుండా గణనాథులకు ప్రత్యేకంగా పూజలు చేశారు.  

ఏకాదశి శనివారం పురస్కరించుకొని గణపతిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. బొజ్జ గణపయ్యకు వివిధ రకాల ప్రత్యేక ప్రసాదాలను నివేదించారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి గణేశునికి మంగళహారతులను సమర్పించారు. భజనలు, మంగళహారతులతో గణపతి మండపాల వద్ద కోలాహలం నెలకొంది. మరోవైపు ఇప్పటికే పట్టణంలోని గణేశ్​ నిమజ్జనం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details