భారత నౌకాదళంలో అత్యున్నత స్థాయికి మన హైదరాబాదీ - తొలి ఎంహెచ్ 60ఆర్ హెలికాప్టర్‌ను నడిపే ఛాన్స్ - Captain Abhishek Ram Interview - CAPTAIN ABHISHEK RAM INTERVIEW
Published : Apr 10, 2024, 4:25 PM IST
MH 60R Helicopter Squadron Commanding Officer Interview : చిన్న తనం నుంచే మామయ్య స్ఫూర్తితో ఆర్మీ స్కూల్లో చదివాడు ఆ హైదరాబాదీ. పక్కా ప్రణాళికతో భారత నౌకాదళంలో అత్యున్నత స్థాయికి చేరాడు. ఇటీవలే అత్యంత శక్తిమంతమైన తొలి ఎయిర్ స్క్వాడ్రన్ నడిపే అద్భుత అవకాశం అందుకున్నాడు. సముద్ర లోతుల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములను క్షణాల్లోనే మట్టుబెట్టే ఎంహెచ్ 60ఆర్ (MH 60R) సీహాక్ హెలికాప్టర్‌కు మొదటి కమాండింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించాడు.
తొలి ఎయిర్ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్ అయిన మన హైదరాబాద్‌కు చెందిన కెప్టెన్ అభిషేక్ రామ్, కొచ్చిన్‌లో ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్‌ను నడపే అవకాశం దక్కించుకున్నారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఆయన, మామయ్యను స్ఫూర్తిగా తీసుకుని నౌకాదళంలో చేరాడు. అనతి కాలంలోనే భారత నౌకాదళంలో టెస్టింగ్ పైలట్ స్థాయికి చేరుకున్నాడు. ఎంతో శక్తిమంతమైన ఎంహెచ్ 60ఆర్ సీహాక్ను మొదటి సారి నడపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్ అభిషేక్ రామ్‌తో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం..