తెలంగాణ

telangana

ETV Bharat / videos

82ఏళ్ల ఏజ్​లో 'బామ్మ' తగ్గేదేలే- విద్యార్థులతో ఈక్వల్​గా మార్షల్ ఆర్ట్స్ - Meenakshi Amma Martial Arts - MEENAKSHI AMMA MARTIAL ARTS

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 8:16 AM IST

Meenakshi Amma Martial Arts Performance : కర్ణాటకకు చెందిన మార్షల్ ఆర్ట్స్‌ నిష్ణాతురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మీనాక్షి అమ్మ ప్రదర్శనను చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. 82 ఏళ్లు వచ్చినా యువతిలా మీనాక్షి ప్రదర్శన ఇవ్వడం వల్ల అంతా చప్పట్లతో హోరెత్తించారు. ఆమెపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.

ఉడిపిలోని శనివారం సాయంత్రం అడమారు మఠం నిర్వహించిన కలరి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనకు విచ్చేశారు మీనాక్షి అమ్మ. కార్యక్రమంలో భాగంగా తన విద్యార్థులతో కలిసి కలరి మార్షల్ ఆర్ట్స్‌ను ప్రదర్శించారు. పెద్ద వయసులో కూడా మీనాక్షి అమ్మ అద్భుత ప్రదర్శన చూసి వీక్షకులు ఆశ్చర్యపోయారు. 

అయితే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఆడపిల్లలు ఈ కళలో ప్రావీణ్యం సంపాదించాలని మీనాక్షి అమ్మ కోరారు. సమాజంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు సహాయపడి, భౌతికరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. అన్ని వయసుల వారికి తాను కలరి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ఆమెను కార్యక్రమంలో నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details