'వారసత్వ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించదు - ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో అధిష్ఠానానికి బాగా తెలుసు' - MP Etela Rajendar Latest Comments - MP ETELA RAJENDAR LATEST COMMENTS
Published : Jun 23, 2024, 6:16 PM IST
MP Etela Rajender in BJP Posting : వారసత్వ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించదని, రాష్ట్రంలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో అధిష్ఠానానికి స్పష్టత ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో కంటోన్మెంట్ సీతారాంపురంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కాలనీవాసులు శాలువాలు కప్పి సన్మానించారు.
అక్కడ మాట్లాడిన ఆయన బీజేపీలో కీలక నాయకులకు, అన్ని వర్గాల వారికి సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రంలో అన్ని సమస్యలపై అవగాహన ఉందని తెలిపారు. బీజేపీకి అధికారం ఇస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే సంకేతాలని అన్నారు. కంటోన్మెంట్ సమగ్ర సమున్నత అభివృద్దిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.