వామ్మో! 18.5 అడుగుల కొండచిలువను చూశారా? - PYTHON VIRAL VIDEO
Published : 11 hours ago
Python Viral Video : ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. బైసిఘేరి గ్రామంలోని పొలంలో పైథాన్ కనపడగా అంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత స్థానికులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కొండచిలువను రక్షించి తీసుకెళ్లారు.
"శుక్రవారం రాత్రి 9 గంటలకు బైసిఘేరి గ్రామంలో పొలంలో 18.5 అడుగుల పొడవైన కొండచిలువను స్థానికులు గుర్తించారు. మాకు సమాచారం అందించగా, వెళ్లి రక్షించాం. కొండచిలువకు చిన్నపాటి గాయాలు ఉన్న కారణంగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత డీఎఫ్ఓ సార్ ఆదేశాల మేరకు కొండచిలువను అటవీ ప్రాంతలో వదలనున్నాం" అని ఫారెస్ట్ గార్డ్ సునీల్ రంజన్ రౌతరాయ్ తెలిపారు.
హైవేపై భారీ కొండచిలువ హల్చల్! 12 అడుగుల పైథాన్ చూసి అంతా హడల్!!
పొలంలో 13 అడుగుల భారీ కొండచిలువ- 7 గంటలు శ్రమించి పట్టుకున్న అధికారులు
స్కూటీలో దూరిన ఏడు అడుగుల పాము- వర్షాలకు వచ్చి డూమ్లో నక్కి!