LIVE : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - కిషన్‌రెడ్డి లైవ్
Published : Feb 3, 2024, 5:46 PM IST
|Updated : Feb 3, 2024, 6:05 PM IST
BJP State Chief Kishan Reddy LIVE : హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మాదిరి మాయమాటలు చెప్పకుండా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాసేవలో తమ పనితనం చూపించాలని కోరారు. మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించి గులాబీ పార్టీ ఫామ్‌హౌస్‌కే పరిమితమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాయమాటలు చెప్పకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్, బోరబండ, మధురానగర్ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం కారణంగా నగరంలోని బస్తీలు అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నాయకులు లోక్‌సభ ఎన్నికలపై కార్యాచరణ చేపట్టారు. పార్టీ చేరికలపై దృష్టి సారిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు గెలిచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదంటూ జోస్యం చెప్పారు.