లయన్స్ Vs డాగ్స్- గోశాల వద్ద పెద్ద ఫైట్- సింహాలను తరిమికొట్టిన కుక్కలు - Lions Vs Dogs Viral Video - LIONS VS DOGS VIRAL VIDEO
Published : Aug 15, 2024, 3:36 PM IST
ఎదురుగా ఉన్నది సింహాలు. అది కూడా ఒక్కటి కాదు. రెండు సింహాలు యుద్ధానికి వచ్చాయ్! కానీ ఆ కుక్కలు అదరలేదు, బెదరలేదు. సింహాలపైకే దూసుకెళ్లాయి. యుద్ధానికి సిద్ధమయ్యాయి! తమ యజమాని గోశాలలోకి రాకుండా అడ్డుకున్నాయి. గుజరాత్లో ఇటీవల జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది!
Lions Vs Dogs Viral Video : అమ్రేలీ జిల్లాలోని థోర్డి గ్రామంలో ఉన్న ఓ గోశాల గేటు వద్దకు అక్కడికి సమీపంలోని అడవి నుంచి రెండు సింహాలు వచ్చాయి. వాటిని చూసి లోపల ఉన్న కుక్కలు మొరిగాయి. సింహాలు కూడా కుక్కలను చూసి గర్జించాయి. కానీ శునకాలు ఏమాత్రం తగ్గకుండా వాటిని లోపలకు రాకుండా అడ్డుకున్నాయి.
రెండు సింహాల దెబ్బకు గోశాల గేటు తెరుచుకుంది. కానీ కుక్కల ధైర్యానికి భయపడి సింహాలు వెళ్లిపోయినట్లు వీడియాలో కనిపిస్తోంది. చివరకు కుక్కల అరుపులు విన్న ఓ వ్యక్తి వచ్చి గేట్ మూసివేసి లోపలకు వెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.