తెలంగాణ

telangana

ETV Bharat / videos

సనత్​నగర్​ ఈఎస్​ఐ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స - ESIC Laparoscopic Surgery Success - ESIC LAPAROSCOPIC SURGERY SUCCESS

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 2:08 PM IST

Sanathnagar ESIC Laparoscopic Surgery Success : హైదరాబాద్​ సనత్ నగర్​లోని ఈఎస్​ఐ అసుపత్రిలో వైద్య నిపుణులు తొలిసారి అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. 158 కేజీల బరువు, తీవ్రమైన వెన్ను నొప్పి, హైపర్ టెన్షన్, ఆస్టియో ఆర్థరైటిస్, అవీవ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్న 32 ఏళ్ల మహిళకు లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ శస్త్రచికిత్స నిర్వహించారు. రెండు నెలల వ్యవధిలో 23 కిలోల బరువు తగ్గించి, ఇతర సమస్యలన్నీ దూరం చేశారు.

ESIC Card Holders Benefits in Medical Services : ఆసుపత్రిలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డా.వేణు నేతృత్వంలో డా.భాస్కర్ రెడ్డి, బి.అనన్య ఈ శస్త్ర చికిత్సలో పాల్గొన్నారు. చికిత్స అనంతరం బాధితురాలికి హైపర్ టెన్షన్ తగ్గిపోవడంతో మందులు నిలిపివేశామని, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్​ఏ) లక్షణాలు కూడా తగ్గిపోయాయని డా. వేణు తెలిపారు. ఈఎస్​ఐ కార్డు హోల్డర్లు మెరుగైన ప్రమాణాలతో అందుబాబులో ఉన్న సనత్​నగర్​ ఈఎస్​ఐసీ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details