మరో ఏక్నాథ్ షిండేగా రేవంత్ మారినా ఆశ్చర్యం లేదు : కేటీఆర్ - KTR Comments on adhani
Published : Jan 24, 2024, 7:52 PM IST
KTR Interesting Comments on CM Revanth Reddy : బీఆర్ఎస్ను అంతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ మిత్రుడైన అదానీని పదేళ్లలో ఒక్కసారి రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయలేదని అన్నారు. రేవంత్‌రెడ్డి భవిష్యత్తులోని అన్ని సంస్థలను కట్టబెట్టే ప్రమాదముందన్నారు. కరీంనగర్‌లో పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పేరుతో జరిగిన సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీల విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు ఆ రెండు పార్టీల వైఫల్యాలను కూడా ప్రజలకు తెలిసేలా పని చేయాలని సూచించారు.
KTR Comments on Adani : మహారాష్ట్ర మాదిరిగా రాష్ట్రంలోనూ మరో ఏకనాథ్‌షిండేగా రేవంత్‌రెడ్డి మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదన్నారు. హామీలను అమలుచేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి మైనార్టీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే ధ్యేయంగా సోషల్ మీడియా వారియర్స్ ముఖ్య పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు.