ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కోర్టుకు రావడానికి అభ్యంతరమేంటి?: న్యాయవాది సలీం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 18, 2024, 4:42 PM IST
Kodi Kathi Case: కోడికత్తి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మాజీ సీఎం జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాలని నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీమ్ డిమాండ్ చేశారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు విశాఖ ఎన్ఐఏ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆయనతోపాటు న్యాయవాది సలీమ్, దళిత సంఘాల నాయకులు వచ్చారు. విచారణకు హాజరుకాకుండా కావాలనే కేసును సాగదీయాలని జగన్ చూస్తున్నారని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కోర్టును రాను అంటే సీఆర్పీసీ 37 కింద అరెస్టు చేసి, వాంగ్మూలం రికార్టు చేయాలన్నారు.
ఓ కేసులో మంత్రిగా ఉండి కోర్టుకు లోకేశ్ హాజరయ్యారని, ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మాత్రం కోర్టుకు రావడం లేదని అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా కోర్టుకు హాజరు కావడానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కోర్టుకి హాజరు కావాలని జనుపల్లి శ్రీనివాస తరఫు న్యాయవాది సలీం, దళిత సంఘాల నేత బూసి వెంకటరావు డిమాండ్ చేశారు.