LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ - Kishan Reddy Live - KISHAN REDDY LIVE
Published : Mar 23, 2024, 4:25 PM IST
|Updated : Mar 23, 2024, 4:54 PM IST
Kishan Reddy Press Meet Live : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రానున్న పార్లమెంట్ ఎన్నికలపై మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు దేశమంతా మోదీయే మరోసారి ప్రధాన మంత్రిగా కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మోదీ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపైన కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు రహస్యంగా మంతనాలు జరుపుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతారని నిలదీశారు. మరోవైపు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ గ్యారంటీల అమలు, దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు వంటి పలు అంశాలపై కిషన్ రెడ్డి ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు.
Last Updated : Mar 23, 2024, 4:54 PM IST