3617 సెకన్లపాటు మేఘన కూర్మాసనం- ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం - KURMASANA YOGA RECORD
Published : Oct 26, 2024, 7:12 AM IST
Kurmasana Yoga Record : కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 13 ఏళ్ల విద్యార్థిని గంటా 17 సెకన్ల పాటు కూర్మాసన యోగా చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కురాలిగా నిలిచింది. గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన స్నేహ 45 నిమిషాల పాటు కూర్మాసన యోగా చేసి రికార్డు నెలకొల్పగా తాజాగా మంగళూరుకు చెందిన మేఘన ఆ రికార్డును బద్దలుకొట్టింది. సెప్టెంబరు 27న ఈ ఘనతను సాధించగా తాజాగా సర్టిఫికెట్‌ను అందుకుంది. తన గురువు కవిత అశోక్ మార్గదర్శకంలో ఈ రికార్డు సాధించానని మేఘన తెలిపింది. ఈ రికార్డును సొంతం చేసుకునేందుకు ఎంతో శ్రమించానని చెప్పింది. మేఘనా ఒకటో తరగతి నుంచి క్రమం తప్పకుండా యోగా తరగతులకు వెళుతుండేదని ఆమె తల్లి చెప్పారు.
మరోవైపు, యోగా టీచర్ కవితా అశోక్, తన విద్యార్థిని మేఘన సాధించిన ఘనతను కొనియాడారు. అరుదైన ఘనత సాధించాలంటే చిన్నప్పటి నుంచి యోగా సాధన చేయాలని, కూర్మాసనం లాంటి యోగాసనం అంతసేపు వేయడం కష్టమేనని తెలిపారు. కఠోర శ్రమతోనే మేఘన ఘనత సాధించిందని చెప్పారు.