'కేంద్రంలో వరుసగా మూడోసారి NDA ప్రభుత్వమే- ఈసారి బీజేపీకి 370 సీట్లు పక్కా!'- ఈటీవీ భారత్తో నడ్డా - Lok Sabha elections 2024
Published : May 22, 2024, 12:51 PM IST
JP Nadda on BJP Win : కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎన్డీఏ అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పారు. అలాగే దిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో కమలంమే విజయ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈటీవీ భారత్తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
'దేశ, దిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించడానికి ఆసక్తిగా ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. లోక్సభ ఎన్నికల ఐదు విడతల పోలింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే ఎన్డీఏ 300 సీట్లను అధిగమించింది. మిగిలిన రెండు దశల్లోనూ బీజేపీ 370 సీట్లు సాధిస్తుంది. ఇక ఎంపీ స్వాతీ మాలీవాల్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ ఎందుకు మౌనంగా ఉన్నారు? కేజ్రీవాల్ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దిల్లీ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికి క్షమించరు. కాంగ్రెస్, ఇండియా కూటమి కలిసి రిజర్వేషన్లు తీసివేసి ముస్లింలకు ఇస్తారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రధాని మోదీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు' అని జేపీ నడ్డా విమర్శించారు.