దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన జితేందర్‌రెడ్డి - TG GOVT REPRESENTATIVE IN DELHI - TG GOVT REPRESENTATIVE IN DELHI
Published : Jun 26, 2024, 1:14 PM IST
Telangana Govt Special Representative in Delhi Jithender Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మల్లు రవి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జితేందర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
విభజన అంశాల పరిష్కారం, కృష్ణానదిలో సమాన వాటా, రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కృషి చేస్తానని జితేందర్ రెడ్డి వివరించారు. మరోవైపు స్పోర్ట్స్ అడ్వైజర్‌గా రాష్ట్రంలో క్రీడా సౌకర్యాలు మెరుగయ్యేలా పనిచేస్తానని తెలిపారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం దేశానికి వస్తే హైదరాబాద్‌లోనూ కొన్ని ఈవెంట్స్ జరిగేలా చూస్తానని జితేందర్ రెడ్డి వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా స్థానం కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.