బైక్‌తో 691 ట్యూబ్లైట్లను పగలగొట్టిన ఆర్మీ జవాన్- ప్రపంచ రికార్డ్
Published : Feb 17, 2024, 11:31 AM IST
Jawan Breaks Tubelights With Bike : ద్విచక్రవాహనంతో 691 ట్యూబ్లైట్లను పగలగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు ఆర్మీ జవాన్ దుర్గేశ్ కుమార్. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ కోబ్రా మైదాన్‌లో జరిగిన ఈవెంట్లో ఈ ఘనత సాధించారు. ఆర్మీకి చెందిన డేర్‌డెవిల్ టీమ్ సభ్యుడిగా హవల్దార్ దుర్గేశ్ కుమార్ 2004 నుంచి కొనసాగుతున్నారు. ఇప్పటికే అనేక ప్రపంచ రికార్డులు సృష్టించే ఈవెంట్లలో పాల్గొన్నారు.
అయితే దుర్గేశ్ కుమార్ తరచూ ట్యూబ్ లైట్లు పగలగొట్టే ఫీట్ చేసేవారు. దాని ప్రపంచ రికార్డుగా మలచడానికి బైక్‌తో ఏకంగా 691 ట్యూబ్ లైట్లను బద్దలు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డేర్‌డెవిల్ జట్టు ఇప్పటి వరకు 32 ప్రపంచ రికార్డులను సాధించింది. విన్యాసాలు చేసేందుకు డేర్‌డెవిల్ టీమ్ రోజూ ప్రాక్టీస్ చేస్తోంది. చాలా క్రమశిక్షణతో సాధన చేస్తుంటోంది.
డేర్‌డెవిల్ టీమ్‌లో మరో సభ్యుడు ధర్మేంద్ర సింగ్ ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. 12 అడుగుల ఎత్తున్న సీడీని మోటర్‌సైకిల్‌పై ఎక్కించుకుని 12 గంటల పాటు మైదానంలో డ్రైవ్ చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు అదే జట్టుకు చెందిన ఇంకో సభ్యుడి పేరిట ఉంది. ఇప్పుడు ఈ రికార్డును ధర్మేంద్ర సింగ్ బద్దలుకొట్టనున్నారు.