రికార్డ్ సృష్టించిన బతుకమ్మ - 36.2 అడుగుల తయారీకి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు - Worlds Largest Bathukamma Jangaon - WORLDS LARGEST BATHUKAMMA JANGAON
Published : Oct 2, 2024, 8:19 PM IST
Worlds Largest Bathukamma Created in Jangaon School : జనగామ జిల్లాలోని ఓ పాఠశాలలో అతిపెద్ద బతుకమ్మను తయారు చేసి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. జిల్లాలోని నెహ్రూ పార్క్ సెయింట్ మెరీస్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాల్లో భాగంగా 36.2 అడుగుల బతుకమ్మని తయారు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 30 మంది ఉపాధ్యాయులు అలాగే 700 మంది విద్యార్థులు పాల్గొని బతుకమ్మని 24 గంటలలోపు తయారు చేశారు.
ఈ సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్లు వారి తరఫున ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఇంతకు ముందు ఉన్న 31 అడుగుల బతుకమ్మ రికార్డును బ్రేక్ చేసినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో సెయింట్ మేరీస్ స్కూల్ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు బతుకమ్మ పండుగలో మొదటిరోజైన ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఆహ్లాదంగా సాగాయి. అన్ని జిల్లాలోని ఊరూ వాడా రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడారు.