తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు- హాజరైన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ - isha foundation mahashivratri 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 11:04 AM IST

Isha Foundation Mahashivratri 2024 : తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో దేశవిదేశాల నుంచి భారీగా భక్తులు హాజరయ్యారు. శివయ్య నామస్మరణతో కోయంబత్తూరు ఈశా ఫౌండేషన్ యోగా కేంద్రం మార్మోగిపోయింది. శుక్రవారం రాత్రి జాగారం చేసేందుకు వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో జగ్గీ వాసుదేవ్​ భక్తులతో మమేకమై శివయ్య నామస్మరణ చేశారు.

అంతకుముందు కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ జ్యోతి వెలిగించి మహాశివరాత్రి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగదీప్‌ ధన్‌ఖడ్‌ సతీమణి సుదేష్‌ ధన్‌ఖడ్‌, సద్గురు జగ్గీవాసుదేవ్‌, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పాల్గొన్నారు. మహాశివుడి సన్నిధిలో జాగారం చేసేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాగా, కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో జర్మనీకి చెందిన యుగరూపా పాల్గొన్నాడు. 'ఇదొక అద్భుతమైన రాత్రి. మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. సద్గురు జగ్గీవాసుదేవ్​తో శివరాత్రి వేడుకల్లో పాల్గొనడం ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నా.' అని తెలిపాడు. 

ABOUT THE AUTHOR

...view details