Live : విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాలు మిలన్-2024, ప్రత్యక్ష ప్రసారం - Vizag Navy Day
Published : Feb 22, 2024, 4:51 PM IST
|Updated : Feb 22, 2024, 7:21 PM IST
Indian Navy Milan 2024 Exercises at Visakha Live : మిలాన్ 2024 సందర్భంగా విశాఖలో విమానాలు గాలిలో రయ్ మంటూ దూసుకెళ్తూ, హెలికాప్టర్లు గగనంలో చక్కర్లు కొట్టాయి. బీచ్ రోడ్డు, సముద్ర తీరంలో నావికదళ విన్యాసాలు ఔరా అనిపించాయి. వివిధ నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరణ, లేజర్ షో అందరినీ అకట్టుకుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మిలాన్ 2024 విన్యాసాలు విశాఖలో జరుగుతున్నాయి. ఫుల్ డ్రస్ రిహార్సల్స్ విశాఖ ఆర్కే బీచ్‌లో సందడిగా సాగాయి.
నౌకాదళానికి చెందిన 60కి పైగా హెలీకాప్టర్‌లు, అత్యాధునిక యుద్ధ విమానాలు గగన తలంలో చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. సిటీ పరేడ్‌లో వివిధ దేశాల బృందాలు కవాతు నిర్వహించాయి. గురువారం జరిగే పూర్తి స్థాయి విన్యాసాలకు సర్వం సిద్ధమైంది. భారత నౌకదళ పాఠవాన్ని ఇక్కడి సదుపాయాలను ఇతర నేవీలకు పరిచయం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఇండియన్ నేవీ మిలన్ 2024 విన్యాసాలు ప్రత్యక్ష ప్రసారం మీకోసం.