తెలంగాణ

telangana

ETV Bharat / videos

చివరిరోజు తండోపతండాలుగా మేడారం బాటపట్టిన భక్తులు - కిలోమీటర్ల మేర నిలిచిన ఆర్టీసీ బస్సులు

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 11:23 AM IST

Huge Traffic Jam in Medaram Jatara : ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగింపు దశకు వచ్చేసింది. వనం నుంచి వచ్చిన సమక్క-సారలమ్మ దేవతలు ఇవాళ రాత్రి తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. ఈ సందర్భంగా వన దేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు నిర్విరామంగా తరలి వస్తున్నారు. దీంతో తాడ్వాయి-మేడారం మార్గంలో కిలోమీటర్ల మేర భారీగా ఆర్టీసీ బస్సులు గంటల తరబడి నిలిచిపోయాయి.

Heavy Traffic Jam in Medaram Jatara : ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా మేడారం వెళ్లే బస్సులు ఆలస్యంగా గమ్యానికి చేరుకుంటున్నాయి. దీంతో సమక్క-సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వన దేవతలను దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో ట్రాఫిక్​ రద్దీ క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మేడారం మార్గంలో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details