అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్‌లో ఎన్నికలు - గంటపాటు సిబ్బంది సాహసం - 160 మంది కోసం! - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
Published : May 8, 2024, 1:21 PM IST
Highest Polling Booth Election In Pune : సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ సందర్భంగా 4,491 అడుగుల ఎత్తున భారత ఎన్నికల సంఘం విజయవంతంగా ఓటింగ్ నిర్వహించింది. కేవలం 160 మంది ఓటర్ల కోసం ఈ పోలింగ్ ఏర్పాటు చేసింది. అదే మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలోని రాయరేశ్వర్ పోలింగ్ బూత్.
ఇనుప నిచ్చెనపై సిబ్బంది ప్రయాణం
పుణె గ్రామీణ ప్రాంతంలోని భోర్ తాలూకాకు 30 కిలోమీటర్ల దూరంలో ఈ రాయరేశ్వర్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఈసీ. ఈ బూత్‌కు చేరుకోవడానికి ఎన్నికల సిబ్బంది రాయ్‌రేశ్వర్ పర్వత ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ నుంచి మరో 18 కిలోమీటర్ల ప్రయాణం చేసి రైరేశ్వర్ బేస్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి పోలింగ్ స్టేషన్‌కు చేరుకోవడానికి ఇనుప నిచ్చెన సాయంతో గంట పాటు ప్రయాణించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర పరికరాలతో కష్టమైనప్పటికీ ఎన్నికల సిబ్బంది సాహసం చేసి అక్కడికి చేరుకున్నారని ఈసీ తెలిపింది. అలాగే విజయవంతంగా పోలింగ్ నిర్వహించినట్లు పేర్కొంది.