బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు - Telangana Graduate MLC Elections - TELANGANA GRADUATE MLC ELECTIONS
Published : May 7, 2024, 5:22 PM IST
|Updated : May 7, 2024, 6:16 PM IST
BRS Graduate MLC Candidate Nomination : నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు పర్వం జోరందుకుంది. బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ లక్ష్మీగార్డెన్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందచేశారు. ర్యాలీలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా పి. సుజాత, బుగ్గ శ్రీకాంత్, పాలకూరి అశోక్‌గౌడ్‌లు రిటర్నింగ్ అధికారి మహేందర్ వద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సోమవారం ఒక్కరోజే పలు పార్టీలు, స్వతంత్రులు కలిపి 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేసిన వారి సంఖ్య 22కు చేరుకుంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడినా ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని, పట్టభద్రుల ఎన్నికల్లో ఏనుగుల రాకేశ్ రెడ్డి ఘనవిజయం సాధిస్తాడని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.