తెలంగాణ

telangana

ETV Bharat / videos

నల్లమల అడవిలో కార్చిచ్చు- 18 కిలోమీటర్ల మేర అగ్నికి ఆహుతి - నల్లమల అడవిలో అగ్ని ప్రమాదం

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 10:22 PM IST

Fires in the Nallamala Forest at Amrabad in Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అమ్రాబాద్, దోమలపెంట రేంజ్ పరిధిలోని ఉప్పునుంతల గ్రామ సమీప అడవి నుంచి కృష్ణా నది కాలువ సమీపంలో ఉన్న వజ్రాల మడుగు,తాటిగుండాల, తిమ్మారెడ్డిపల్లి ప్రాంతంలో భారీస్థాయిలో మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఫైర్ సిబ్బంది, ఫైర్ వాచర్లు, బేస్ క్యాంప్ వాచర్ల సహాయంతో మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. 

Fire in Amrabad Tiger Reserve Forest : ఒక పక్క రోజు పెరుగుతున్న ఎండలు, మరోపక్క చెలరేగుతున్న నిప్పు వేడిలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది సాయశక్తుల ప్రయత్నించారు. ఎట్టకేలకు విజయవంతంగా మంటలను ఆర్పారు. అగ్నిప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించడంతో గత రెండు రోజుల నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని సుమారు 18 కిలో మీటర్ల పొడవున అడవి అగ్నికి ఆహుతైనట్లు అధికారులు గుర్తించారు. వేసవికాలంలో అటవికి వచ్చిన కొందరు ఆకతాయిలు నిప్పు పెట్టే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details