తెలంగాణ

telangana

ETV Bharat / videos

చక్కెర ఫ్యాక్టరీ కోసం 9 నెలలగా రైతు నిరసన - చెప్పులు వేసుకోకుండా, గడ్డం తీయకుండా దీక్ష - Committee Inspect on Sugar Factory

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 2:12 PM IST

Farmer Protest for Muthyampet Sugar Factory : జగిత్యాల జిల్లాలో మూతపడ్డ ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపించాలని వేడుకుంటూ ఓ రైతు వినూత్నంగా నిరసన దీక్ష చేపట్టారు. మెట్‌పల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన రైతు మామిడి నారాయణరెడ్డి చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కర్మాగారం తెరిపించాలని ఎంతోమంది మంత్రులను, అధికారులను కలిసినా ఫలితం లేకపోవడంతో నారాయణరెడ్డి కొండగట్టు ఆంజనేయస్వామి వద్దకు వెళ్లి మొక్కుకున్నట్లు తెలిపారు.

Committee to Inspect on Sugar Factory at Muthyampet : కర్మాగారం తెరిచే వరకు చెప్పులు వేసుకోకుండా, గడ్డం తీయకుండా దీక్ష చేపట్టారు. గత తొమ్మిది నెలల నుంచి కాళ్లకు చెప్పులు లేకుండానే వెళ్తున్నాడు. కనీసం దేవుడైనా కనికరిస్తారని ఈ విధంగా దీక్ష చేపట్టానని రైతు మామిడి నారాయణరెడ్డి తెలిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఫ్యాక్టరీ తెరిచేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో మంచి రోజు చూసుకొని కొండగట్టు వెళ్లి మొక్కును తీర్చుకుంటానని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details