తెలంగాణ

telangana

ETV Bharat / videos

కజిరంగలో 30ఏనుగుల జలకాలాట- వరదల తగ్గుముఖంతో సందడి- వీడియో చూశారా! - Kaziranga Elephants Video - KAZIRANGA ELEPHANTS VIDEO

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 2:51 PM IST

Elephant Viral Video In Assam : అసోంలో వరదల బీభత్సంతో జనజీవనం అతలాకుతలమైంది. అనేక వన్యప్రాణులు కూడా మరణించాయి. ఈ వరదలకు కజిరంగ నేషనల్​ పార్క్​ కూడా నీట మునిగిపోవడం వల్ల జంతువులు తీవ్ర ఇబ్బంది పడ్డాయి. ప్రస్తుతం వరద నీరు తగ్గుముఖం పట్టడం వల్ల బయటకు వెళ్లిన జంతువులు తిరిగి జాతీయపార్కుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కజిరంగ పార్కులో ఓ ఏనుగుల వీడియో కనువిందు చేస్తోంది. హతిమురా సమీపంలోని వరి పొలాలు నీళ్లతో నిండి ఉన్నాయి. ఆహారం కోసం పొలాలకు వచ్చిన ఓ ఏనుగుల గుంపు సరదాగా తిరిగాయి. అలా కొంత సమయం నీటిలో తిరిగిన తర్వాత కజిరంగ పార్కు వెళ్లిపోయాయి. వాటిని స్థానిక ఫొటోగ్రాఫర్ కావ్య కమల్ హజారికా తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. కజిరంగా పార్క నీట మునగడం వల్ల గత రెండు రోజులగా ఏనుగులు అక్కడే ఉన్న నది ఒడ్డున ఉంటున్నాయని స్థానికులు అంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details