హిట్ అండ్ రన్ కేసులో మార్పులను నిరసిస్తూ పలు చోట్ల డ్రైవర్ల ఆందోళన - Cab Drivers Protest for Hit and Run
Published : Feb 16, 2024, 4:29 PM IST
Drivers Protest against Hit and Run Case : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ కేసులో మార్పును నిరసిస్తూ రాష్ట్రంలో పలు చోట్ల డ్రైవర్లు ర్యాలీ చేపట్టారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఓరుగల్లు ప్రైవేట్ విద్యా సంస్థల డ్రైవర్స్ క్లీనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల డ్రైవర్లు, క్లీనర్లు విధులను బహిష్కరించినట్లు తెలిపారు.
Auto and Cab Drivers Protest against Hit and Run Case : హైదరాబాద్ నారాయణగూడలో ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం వల్ల ప్రైవేటు రంగాలకు సంబంధించిన రవాణా సేవలు కూడా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, ఈ చట్టం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నిరసన వ్యక్తం చేశారు.