తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాముతో కుక్క ఫైట్- ప్రాణాలకు తెగించి యజమానిని కాపాడిన 'డైసీ' - Dog Fight With Snake Video - DOG FIGHT WITH SNAKE VIDEO

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 3:16 PM IST

Dog Fight With Snake Video : ఇంట్లోకి వచ్చిన పాముతో తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడింది ఓ శునకం. తన యజమానిని పెను ప్రమాదం నుంచి తప్పించింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లాలో జరిగింది. సంబంధిత వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. 
అయితే ఇంతకుముందు ఎలుగుబంటితో విరోచితంగా పోరాడి వార్తల్లో నిలిచిన ఈ పెంపుడు శునకం మరోసారి చర్చనీయాంశమైంది.

ఇదీ జరిగింది
మాట్వాడా లాల్ గ్రామానికి చెందిన రోషన్ సాహు 'డైసీ' అనే జర్మన్ షెపర్డ్​ జాతి శునకాన్ని పెంచుకుంటున్నాడు. తాజాగా తన యాజమాని ఇంట్లోకి ప్రవేశించిన పాముతో విరోచితంగా పోరాడింది డైసీ. పాముపై దాడి చేసి చంపేసింది. తన ప్రాణాలను పణంగా పెట్టి, తన యాజమానిని పెద్ద ప్రమాదం నుంచి బయటపడేసింది. అయితే గతంలో తన యజమాని ఇంటి మీదకు వచ్చిన ఎలుగుబంటిని తరిమికొట్టి ధైర్యసాహసాలను ప్రదర్శించి చర్చనీయాంశమైంది. తాజా ఘటనతో మరోసారి డైసీ వార్తల్లో నిలిచింది. 'ఒకవేళ డైసీ లేకుంటే నాకు పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. డైసీనే నా ప్రాణాలు కాపాడింది. ఇంతకుముందు డైసీ, ఒక ఎలుగుబంటి నుంచి నన్ను కాపాడింది. ఇప్పుడు ఓ విషసర్పం నుంచి రక్షించింది.' అని శునకం యజమాని రోషన్ సాహు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details