పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం - పుట్టే బిడ్డలకు కూడా! - Experts Suggestion Tobacco Cancer - EXPERTS SUGGESTION TOBACCO CANCER
Published : May 23, 2024, 7:09 PM IST
Doctor Suggestion on Tobacco Cancer : పొగాకును ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో పాటు గుండె, కాలేయం ఇలా ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పొగతాగడం వల్ల పొగాకు శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ వస్తుందని అన్నారు. గుట్కా, కైనీ తదితర వాటిని తినడం ద్వారా కూడా కిడ్నీ, కార్డియాక్ అరెస్టు ఇలా చాలా వ్యాధులకు కారణం అవుతుందని వివరించారు. ప్రస్తుతం దేశంలో 10 మంది క్యాన్సర్‌తో చనిపోయిన వారిలో ముగ్గురు పొగాకు క్యాన్సర్ ద్వారానే చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు.
Importance of Reduce Tobacco Use : 1970 దశాబ్దం నుంచి పోలిస్తే ప్రస్తుతం పొగాకు తాగడం తగ్గిందనే చెప్పవచ్చని డాక్టర్ తెలిపారు. టెస్ట్ మ్యాచ్‌లాగా ఎక్కువ సంవత్సరాలు పొగాకుకు బానిస అయితే వ్యాధులు అధికమవుతాయని చెప్పారు. పొగతాగడం కంటే గుట్కాలు నమలడం ద్వారానే అధిక ప్రమాదం ఉందని అన్నారు. మహిళలు పొగతాగడం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రభావితం చూపుతుందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో సంవత్సరానికి పది లక్షల మంది ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని వెల్లడించారు. అందుకే పొగాకు వాడడం మనమే మానుకోవాలని సూచించారు.