LIVE : గాంధీభవన్‌లో భట్టి విక్రమార్క మీడియా సమావేశం - Bhatti Vikramarka media conference
Published : May 21, 2024, 12:23 PM IST
|Updated : May 21, 2024, 12:48 PM IST
రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని, కనీస మద్దతు ధరకే కొనాలని తెలంగాణ మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది. ఈసీ అనుమతితో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ అంశాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు.ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజలకు, విద్యార్థులకు 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం ఉందన్న మంత్రి, ఆ మొత్తం రాష్ట్రంలోనే సేకరిస్తామన్నారు. ఇందుకోసం సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల ఆధునీకీకరణకు, సుమారు రూ.600 కోట్లు కేటాయిస్తామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై, మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడిస్తున్నారు.
Last Updated : May 21, 2024, 12:48 PM IST