సడెన్‌గా కూలిన శ్మశానవాటిక గోడ- పక్కన కూర్చున్న ఐదుగురు మృతి- లైవ్ వీడియో - Wall Collapse In Gurgaon - WALL COLLAPSE IN GURGAON
Published : Apr 21, 2024, 11:06 AM IST
Crematorium Wall Collapse In Gurgaon : హరియాణాలో ఓ శ్మశానవాటిక గోడ అకస్మాత్తుగా కూలి ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మరణించిన వారిలో ఒక బాలిక ఉంది. ఈ ఘటన శనివారం సాయంత్రం గురుగ్రామ్‌లో జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు పక్కనే ఉన్న దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో కొంతమంది మదనపురి శ్మశాన వాటిక గోడ పక్కనే కూర్చున్నారు. వారిపై అకస్మాత్తుగా గోడ కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద ఉన్న వారిని రక్షించారు. అనంతరం జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించారు. వేల టన్నుల కలపను గోడకు ఆసరగా చేసుకుని పెట్టడం వల్ల వంగిపోయిందని స్థానికులు తెలిపారు. ఆ శ్మశానవాటిక గోడను సరిచేయాలని ప్రజలు అనేకసార్లు నిర్వాహకులకు చెప్పినా వినలేదని చెప్పారు. అయితే, శ్మశానవాటిక నిర్వాహకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.