రైతు రుణమాఫీపై హరీశ్‌రావు చర్చకు రావాలి : కోదండరెడ్డి - Kodanda Reddy challenges Harishrao - KODANDA REDDY CHALLENGES HARISHRAO
Published : Aug 19, 2024, 3:19 PM IST
Kodanda Reddy challenges Harishrao : బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా నాలుగు గోడల మధ్య కూర్చుని, తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో చర్చకు సిద్ధమని, హరీశ్‌రావు రావాలని ప్రతి సవాల్ విసిరారు. ఇటీవల హరీశ్ రావు రుణమాఫీపై చర్చ, శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసరడంతో కోదండరెడ్డి స్పందించారు. పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసిన సంక్షేమం, 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటనే డేటా తీసుకువస్తామని ఆయన తెలిపారు.
గత 2018-24 వరకు ఆరేళ్లలో వ్యవసాయేతర భూములకు రైతుబంధు కింద రూ.25,676 కోట్లు ఇచ్చారని కోదండరెడ్డి ఆరోపించారు. అందులో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎక్కువ మొత్తంలో లబ్ధి జరిగిందన్న ఆయన, రైతులకు రూ.2 లక్షల కన్నా ఎక్కువ రుణం ఉంటే పైన ఉన్న మొత్తం చెల్లిస్తే, రూ.2 లక్షలు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందని పునరుద్ఘాటించారు. వాస్తవంగా రుణమాఫీ కానీ రైతుల జాబితా ఉంటే, ప్రభుత్వానికి పంపాలని సూచించారు. రైతాంగాన్ని అనవసరంగా ఆందోళనకు గురి చేయవద్దని హితవు పలికారు.