ధరణి సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ : కోదండ రెడ్డి
Published : Feb 29, 2024, 7:22 PM IST
Congress Kodanda Reddy Interview : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్(Dharani Portal Scheme) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాలపై ఇప్పటికే కమిటీ వేసిన విషయం తెలిసిందే. ధరణి సమస్యల పరిష్కారానికి అధికారులకు అదికారాలు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
మార్చి 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం ద్వారా ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు ధరణి కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటైన ధరణి కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసిన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గదర్శకాలను ఇచ్చినట్లు తెలిపారు. ధరణి పోర్టల్‌లో సవరింపు కోసం దరఖాస్తు చేసుకున్న 2.45లక్షల దరఖాస్తులను ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా పరిష్కరిస్తామంటున్న ఆయన ఎక్కడైనా అధికారులు నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ మార్గదర్శకాలపై కోదండ రెడ్డితో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి.