కోడిపుంజుకు చెవి దుద్దులు - గోళ్లకు నెయిల్ పాలిష్ - ముత్యాలమ్మ బోనాల్లో స్పెషల్ అట్రాక్షన్ - Cock Makeover in Bonalu Festival
Published : Aug 12, 2024, 10:41 AM IST
Cock Makeover in Bonalu Festival at Mahabubabad District : ముత్యాలమ్మకు బోనాల సమర్పణ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఓ భక్తుడు వినూత్న రీతిలో మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష్మీనగర్‌కు చెందిన తోడేటి వెంకటేశ్వర్లు కోడిపుంజుకు దుద్దులు కుట్టించి అలంకరించారు. కమ్మలతో, కాళ్ల గోళ్లకు నెయిల్ పాలిష్‌తో అలంకరించడమే కాకుండా మెడకు మద్యంసీసా కట్టి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు.
అమ్మవారికి సమర్పించేందుకు చిన్న మద్యం సీసా కూడా తగిలించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బోనాల్లో ఈ కోడిపుంజుతో పలువురు యువకులు సెల్ఫీలు, ఫొటోలు దిగడం గమనార్హం. బోనాల పండుగలో బుట్టాలతో అలంకరించిన ఈ కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత కొన్నేళ్లుగా ప్రతి బోనాల పండుగకు కోడిపుంజును ఇలాగే అలంకరించి తీసుకువస్తున్నట్లు భక్తుడు తోడేటి వెంకన్న తెలిపారు. ప్రస్తుతం ఈ కోడిపుంజు అలంకరణ వీడియోలు సోషల్ మీడియాలు వైరల్‌గా మారాయి.