తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎరక్కపోయి వచ్చి- గ్యాస్​ సిలిండర్​లో ఇరుక్కుపోయిన పాము - Cobra Trapped In Gas Cylinder - COBRA TRAPPED IN GAS CYLINDER

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 11:41 AM IST

Cobra Trapped In Gas Cylinder : హరియాణా ఫతేహాబాద్‌ జిల్లా కుక్‌డావాలి గ్రామంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన నాగుపాము సిలిండర్​లో ఇరుక్కుపోయింది. చప్పుడు రావడం వల్ల ఇంట్లోవాళ్లు పరిశీలించారు. నాగుపాము సిలిండర్​లో ఇరుక్కుపోవడం గుర్తించారు. కంగారుపడి స్నేక్ క్యాచర్ పవన్ జోగ్‌పాల్‌కు సమాచారం అందించారు. జోగ్‌పాల్‌ ఘటనాస్థలికి చేరుకుని, కట్టర్​ సహాయంతో రెండు గంటలపాడు శ్రమించి నాగుపామును గ్యాస్ సిలిండర్ నుంచి సురక్షితంగా బయటకు తీశాడు.

''కుక్​డాన్‌వాలి గ్రామస్థుడు తనకు ఫోన్ చేశాడు. ఇంట్లోకి పాము వచ్చి సిలిండర్‌లో ఇరుక్కుపోయిందని చెప్పారు. ఘటనాస్థలికి వచ్చి చూడగా అది నాగు పాము అని తెలిసింది. సిలిండర్‌లో ఇరుక్కున్న ఆ పాము బయటకు రావడానికి ఇబ్బంది పడింది. పాముకు నీరు ఇచ్చి, ఆవాల నూనె రాసి పామును బయటకు తీసేప్రయ్నం చేశాను. కట్టర్‌ సహాయంతో రెండు గంటలపాటు శ్రమించి పామును బయటకు తీశాను. చివరకు పామును అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాను'' అని స్నేక్ క్యాచర్ పవన్ జోగ్‌పాల్‌ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details