LIVE : నల్గొండ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH REDDY LIVE
Published : Dec 7, 2024, 5:59 PM IST
|Updated : Dec 7, 2024, 7:16 PM IST
CM Revanth Reddy LIVE : నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగుతోంది. ప్రస్తుతం నల్గొండ మెడికల్ కాలేజీ ప్రారంభం అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింగ హాజరయ్యారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకి పూలు చల్లారు. అనంతరం దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ పనులను ప్రారంభించారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ యూనిట్-2 ఫొటో ప్రదర్శననను సీఎం తిలకించారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు. వైటీపీఎస్ పనులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పరిశీలించారు. ఆ తరువాత నల్గొండలో నిర్మించిన వైద్య కళాశాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
Last Updated : Dec 7, 2024, 7:16 PM IST