తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : దిల్లీలో సోనియాగాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth Reddy Delhi Tour - CM REVANTH REDDY DELHI TOUR

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 5:13 PM IST

CM Revanth Reddy Delhi Tour : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ సర్కారు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అగ్రనేతలను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించారు. భేటీలో రాష్ట్రపాలనకు సంబంధించిన అంశాలను చర్చించారు. రాష్ట్రంలో పథకాల అమలు తీరు గురించి సీఎం పార్టీ అధినాయకత్వానికి నివేదించారు. మరోవైపు ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్​ను కలిసి వేడుకలకు ఆహ్వానించారు. రాష్ట్రపాలన తీరుతెన్నులు, ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలిసారు. తెలంగాణ అవతరణ వేడుకలకు సంబంధించి అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఏదైనా ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. దిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details