విల్లాలకు తాళం విరగొట్టి లాకర్, డబ్బు కొట్టేసిన దొంగలు - Chori Case
Published : Mar 6, 2024, 7:02 PM IST
Chori Case In Hyderabad : బాచుపల్లి పోలీస్ పరిధిలో తాళం వేసిన రెండు విల్లాలకు తాళం విరగొట్టి దొంగతనం చేసిన ఘటన చోటు చేసుకుంది. సీతారాం విల్లాస్ కాలనీలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నెంబర్ 21బి & 2బి 2 విల్లాలలో తెల్లవారు జామున ముడున్నర గంటలకు దొంగలు చోరీకి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. ఓ ఇంట్లో ఉన్న 2 తులాల వెండి విగ్రహం, 8 వేల నగదుతో పాటు లాకర్‌ను ఎత్తుకెళ్లారు.
లాకర్లో విలువైన పత్రాలు ఉన్నాయని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాగా రెక్కీ నిర్వహించాకే పక్కా ప్లాన్‌తో దొంగతనానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సెక్యూరిటీ అధికంగా ఉండే గేటెడ్ కమ్యూనిటీల్లో ఇలా దొంగతనాలు జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు.