'డిజిటల్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన ఘనుడు రామోజీ' - CHIRANJEEVI ABOUT ETV - CHIRANJEEVI ABOUT ETV
Published : Jun 8, 2024, 7:33 PM IST
Chiranjeevi About Ramoji Rao ETV: టెలివిజన్ రంగంలో రామోజీరావు సరికొత్త ఒరవడి సృష్టించారని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. గతంలో ఈటీవీ 20వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. 90ల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఛానెల్ మాత్రమే ఉన్న సమయంలో, రామోజీరావు ఈటీవీ ప్రారంభించి డిజిటల్ మీడియాలో కొత్త ఓరవడి సృష్టించారని అన్నారు. 'పంచతంత్ర', 'మాల్లుడి డేస్', 'అంతరంగాలు' సీరియల్, రైతులకు సంబంధించి 'పాడిపంటలు' ప్రోగ్రామ్స్ ప్రసారాలతో ఈటీవీ ఆకర్షణీయంగా, అత్యద్భుతంగా ఉండేదని గుర్తుచేశారు. ఇక సినిమాకు ఏ మాత్రం తక్కువ కానటువంటి క్వాలిటీతో ఈటీవీలో ప్రసారమయ్యే 'మహా భాగవతం' అంటే ఆయనకెంతో ఇష్టమైన సిరీయల్ అని చిరంజీవి అన్నారు. ఇక గత దశాబ్ద కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షో 'జబర్దస్త్' అంటే కూడా తనకు బాగా నచ్చుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఇంకెన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. మరి అవెంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.