తండ్రి కారు ఢీకొని ఒకటిన్నరేళ్ల చిన్నారి మృతి- సీసీటీవీ వీడియో వైరల్! - FATHER CAR RuN OVER CHILD - FATHER CAR RUN OVER CHILD
Published : Apr 23, 2024, 7:45 PM IST
Child Died After Father Car Run Over : కర్ణాటక రాజధాని బెంగళూరులో హృదయ విదారక ఘటన జరిగింది. తండ్రి కారు ఢీకొట్టి షైజా జన్నత్ అనే ఒకటిన్నరేళ్ల చిన్నారి మృతి చెందింది. తన వెనుక వచ్చిన చిన్నారిని గమనించకుండా, తండ్రి కారును ముందుకు డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కారు ఫ్రంట్ సీట్ డోరు వద్ద నిలుచున్న చిన్నారి పైనుంచి కారు వెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఆగ్రాలో జరిగింది.
చన్నపట్నలో జరిగిన బంధువుల పెళ్లి వేడుకకు హాజరైన ఓ కుటుంబం, ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో ఇటికి తిరిగి వచ్చింది. అందరూ కారు దిగారు. కారును వేరే చోట పార్క్ చేసేందుకు చిన్నారి తండ్రి మళ్లీ కారు ఎక్కాడు. అయితే అతడి వెంటే చిన్నారి వచ్చింది. అది గమనించిన తండ్రి కారును ముందుకు కదిపాడు. కారు చిన్నారి పైనుంచి వెళ్లింది. తీవ్ర గాయాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి హెచ్ఎస్ఆర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.