LIVE:వరద బాధితులు, రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Visit Godavari District - CHANDRABABU VISIT GODAVARI DISTRICT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2024, 12:49 PM IST
|Updated : Sep 11, 2024, 1:14 PM IST
Chief Minister Chandrababu Visit to Godavari Districts Live : గోదావరి జిల్లాల ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం వరద బాధితులు, రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారంకొల్లేరుకు వరద ఉద్ధృతి పెరగడంతో లంక గ్రామాల్లో ఆందోళన నెలకొంది. 8 రోజులుగా లంక గ్రామాలు వరదలోనే ఉన్నాయి. పెద ఎడ్లగాడి వంతెన వద్ద సోమవారం 3.41 మీటర్లు ఉన్న వరద.. మంగళవారానికి 3.46 మీటర్లకు చేరింది. కొల్లేరులో నీరు పెరగడంతో మండవల్లి, కైకలూరు, పెదపాడు, ఏలూరు రూరల్, ఆకివీడు, ఉంగుటూరు, దెందులూరు మండలాల్లోని సాధారణ గ్రామాల్లోకీ నీరు వచ్చింది. ఆటపాక పక్షుల కేంద్రంలోని 274 ఎకరాల చెరువు కొల్లేరులో కలిసిపోయింది. కొల్లేరు ఇలవేల్పు పెద్దింట్లమ్మ ఆలయానికి కైకలూరు, దెందులూరు నుంచి మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి.
Last Updated : Sep 11, 2024, 1:14 PM IST