LIVE: సంధ్య థియేటర్ కేసులో విచారణకు అల్లు అర్జున్ - ప్రత్యక్షప్రసారం - ALLU ARJUN LIVE UPDATES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : 14 hours ago

Updated : 9 hours ago

Allu Arjun Attended for Police Investigation Live : హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంలకు విచారణకు హాజరవ్వాలాని నోటీసులు ఇచ్చారు. ఈనెల 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య ధియేటర్ అల్లు అర్జున్ వచ్చారు. పోలీసులు అనుమతి లేకున్నా అక్కడికి అల్లు ఆర్జున్ రావడం, అదే సమయంలో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు. కాగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు ఆర్జున్​ను ఏ11గా చేర్చారు. అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించగా హైకోర్టు ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వగా జైలు నుంచి విడుదల అయ్యారు. తాజాగా ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసేందుకు ఇవాళ విచారణకు హాజరవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా అల్లు అర్జున్‌ చిక్కడపల్లిలోని పోలీసుల విచారణకు హాజరయ్యారు.
Last Updated : 9 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.