ETV Bharat / politics

ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసు - తెలంగాణ హైకోర్టులో కేటీఆర్​కు ఊరట - HC HEARING ON KTR QUASH PETITION

ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ - ఈనెల 31 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు

HC_Hearing_on_KTR_Quash_Petition
HC_Hearing_on_KTR_Quash_Petition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 17 hours ago

Updated : 15 hours ago

Telangana High Court Hearing on KTR Quash Petition: ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​కు స్వల్ప ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయవద్దన్న ఉత్తర్వులను ఈ నెల 31 వరకు పొడిగించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది.

మరోవైపు హైకోర్టు ఆదేశం మేరకు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్​ను అరెస్టు చేయొద్దంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కౌంటర్​పై కేటీఆర్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.

వాదనలు జరిగాయిలా: ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్​నే దాన కిషోర్ కౌంటర్​గా పరిగణలోకి తీసుకోవాలా అని అదనపు అడ్వకేట్ జనరల్​ను కోర్టు ప్రశ్నించింది. కౌంటర్​పై నిర్ణయాన్ని తెలపడానికి అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి సమయం కోరారు. ఈ నెల 30వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ జారీ చేసిన ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించాలని, కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరడంతో న్యాయమూర్తి అంగీకరిస్తూ 31వ తేదీ వరకు పొడిగించారు. తదుపరి విచారణను కూడా ధర్మాసనం అదేరోజుకు వాయిదా వేసింది.

కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్​పై ఈ నెల 20న హైకోర్టు విచారణ జరిపింది. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ కేసులో (Formula E Car Race Case) తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను రద్దు చేయాలని కేటీఆర్ పిటిషన్​ వేశారు. అయితే ఈ కేసులో ప్రాధమిక దర్యాప్తు పూర్తైనందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.

ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం కేటీఆర్​ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. ఈ నెల 27న కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. పరిశీలించిన ధర్మాసనం కేటీఆర్​ను ఈ నెల 31 వరకు అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

కానిస్టేబుల్​ వేధింపులు - పీహెచ్​డీ విద్యార్థిని బలవన్మరణం

అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌ - విచారణ వాయిదా వేసిన కోర్టు

Last Updated : 15 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.