Physically Handycapped Man Won in National Open River Crossing Swimming Competition : అన్ని అవయవాలు బాగున్నా సాకులు చెప్పి లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేసేవారిని ఎందరినో చూస్తుంటాం. కానీ, ఒక కాలు లేకున్నా చిన్నప్పుడు ఏర్పర్చుకున్న లక్ష్య సాధనలో నదులనే ఈదేస్తున్నారు. విజయవాడకు చెందిన వెంకట నాగశ్రీనివాస నాయుడు. పదో తరగతిలో ఉండగా క్రికెట్ బంతి ఎడమ మోకాలికి తగిలి ఏకంగా కాలునే కోల్పోయారు. అయినా ఏమాత్రం కుంగిపోని వెంకట నాగశ్రీనివాస నాయుడు చిన్నప్పుడు తన మామయ్య గోదావరి నదిలో నేర్పిన ఈతను నేటికీ సాధన చేస్తున్నారు.
ఈతతో గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో ఒంటికాలితో నదులను ఈదేస్తూ నలుగురిలో స్ఫూర్తి నింపుతున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ వైకల్యం అనేది లక్ష్య సాధనకు అడ్డేకాదని నిరూపిస్తున్నారు. సాధారణ క్రీడాకారులతో కలిసి పోటీకి సై అంటున్నారు. రివర్ క్రాసింగ్ పోటీలు, ఏపీ ఆక్వాటిక్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన నేషనల్ ఓపెన్ రివర్ క్రాసింగ్ ఈత పోటీల్లో 1.5 కి.మీ. దూరాన్ని 43 నిమిషాల్లో పూర్తి చేశారు. గతంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో 100 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగం, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగాల్లో మూడో స్థానంలో నిలిచారు.
అందరికీ నచ్చేది - ఆరోగ్యానికి మేలు చేసే 'స్విమ్మింగ్'
రెండు కాళ్లు లేకుంటేనేం! - స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకాలు