LIVE: సంధ్య థియేటర్​ ఘటన - అల్లు అర్జున్‌ మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - ALLU ARJUN PRESSMEET

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2024, 7:59 PM IST

Updated : Dec 21, 2024, 8:34 PM IST

Allu Arjun Press Meet on Sandhya Theater Incident: హీరో అల్లు అర్జున్‌ మీడియా సమావేశం నిర్వహించారు.  పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ప్రస్తావించగా సీఎం రేవంత్​రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన ఘటనను వివరిస్తూ విపక్ష పార్టీలు, సినీ ప్రముఖులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని చురకలంటించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడి గురించి పట్టించుకోకుండా, బెయిల్‌పై విడుదలైన హీరోను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవని ప్రజల ప్రాణాలు కాపాడటమే నా బాధ్యత అని సీఎం వెల్లడించారు. సంధ్య థియేటర్​ ఘటనపై చర్చ సందర్భంగా ఘాటు సీఎం రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్‌ స్పందించారు. మీకోసం ప్రత్యక్ష ప్రసారం 
Last Updated : Dec 21, 2024, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.