Police Arrested Hindupur VRO and Surveyor : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన వీఆర్వో, సర్వేయర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్‌కు సంబంధించిన భూమిని కబ్జా చేసి నకిలీ ఇంటి పట్టాలు సృష్టించి తమకు విక్రయించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా నకిలీ పత్రాలతో 17 మందికి ప్లాట్లు అమ్మినట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో వీఆర్వో రామ్మోహన్ ఇంట్లో సోదాలు చేపట్టారు. అనంతరం వీఆర్వో రామ్మోహన్, సర్వేయర్ శ్రీనివాసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం - వీఆర్వో, సర్వేయర్ అరెస్ట్ - HINDUPUR VRO AND SURVEYOR
ప్లాట్లకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించారని హిందూపురం వీఆర్వో, సర్వేయర్‌పై ఫిర్యాదు - అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2025, 10:16 PM IST