LIVE: సీఎంతో భేటీ అనంతరం సినీ ప్రముఖుల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - TFI WITH TELANGANA CM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2024, 12:09 PM IST
Tollywood Actress Meeting With CM Revanth LIVE : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమావేశమయ్యారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నటులు నాగార్జున, వెంకటేశ్, కిరణ్ అబ్బవరం, దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి సమావేశానికి హాజరయ్యారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, టికెట్ల, బెనిఫిట్ షోలు రద్దు వంటివి అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. నిర్మాత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్‌రాజు ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన తర్వాత రేవంత్ ఈ సమావేశానికి సానుకూలత వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులతో కూడా మాట్లాడిన దిల్‌రాజు గురువారం ఉదయం పది గంటలకు సమావేశం ఉంటుందని మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.