ETV Bharat / state

బుల్లెట్ బండ్లు, థార్ జీప్ - కోడి పందేల్లో గెలిచినోళ్లకే లక్ - KODI PANDALU 2025 IN AP

సంక్రాంతి వేళ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కోడి పందేలు - పందేల కోసం భారీగా బరులు ఏర్పాటు చేసిన నిర్వాహకులు

kodi Pandalu 2025 in AP
kodi Pandalu 2025 in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2025, 8:21 PM IST

Updated : Jan 13, 2025, 9:51 PM IST

Kodi Pandalu 2025 in AP : ఏపీలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి కోళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహించారు. దీంతో కోళ్లు ఢీ అంటే ఢీ అంటూ సై అంటే సై అంటూ హోరాహోరీగా తలపడి రక్తం చిందించాయి.

వీటిని వీక్షించేందుకు వచ్చే ప్రజల కోసం ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఏర్పాటు చేశారు. నగదు తీసుకురాని వారి కోసం నిర్వాహకులు స్పాట్‌ క్యాష్‌ సౌలభ్యం కూడా కల్పించారు. సంక్రాంతి పండగ తొలిరోజున కోట్ల రూపాయలకు పైగా డబ్బులు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. పందేలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ ఔత్సాహికులు తరలివచ్చారు. మరోవైపు భారీ టెంట్లు వేసి పందేలతో పాటు గుండాట, ఇతర జూద క్రీడలు బహిరంగంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో వేలకు వేలు పందేంగా కాస్తున్నారు.

చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా వచ్చి వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. పందెం రాయుళ్లను ఆకర్షిచేందుకు నిర్వాహకులు వివిధ ఏర్పాట్లు చేశారు. వారి కోసం వాహనాల పార్కింగ్, భోజనాలు, అత్యాధునిక వసతులతో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల గెలిచిన వారికి బహుమతులు కూడా అందిస్తున్నారు. కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురులో కోడి పందేల నిర్వాహకులు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

బహుమతులుగా బుల్లెట్ బండ్లు, జీపు : విజేతలకు రూ.25లక్షల విలువైన మహీంద్రా థార్‌ వాహనాన్ని బహుమతిగా ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. పందెం రాయుళ్ల నుంచి మంచి స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క బరిలోనే దాదాపు రూ.5 కోట్ల మేర పందేలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో కోడి పందేల్లో గెలిచిన వారికి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులను బహుమతులుగా ఇచ్చారు.

జోరుగా కోడి పందేలు - చేతులు మారుతున్న లక్షలు

పల్లెల్లో సందడి - ఘనంగా భోగి వేడుకలు

Last Updated : Jan 13, 2025, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.